VIDEO: సర్పంచ్‌లను సత్కరించిన జడ్పీ ఛైర్మన్
VZM: గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సర్పంచ్‌లకు బోగాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అనూష అధ్యక్షతన సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై సర్పంచ్‌లను సత్కరించారు. ఐదేళ్లపాటు వారు చేసిన సేవలను, ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజల పక్షాన నిలిచిన తీరును ప్రశంసించారు.