నేడు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
KMM: మధిర శివాలయం సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ఎస్. అనిల్ కుమార్ తెలిపారు. ఈ కారణంగా అల్లినగరం ఫీడర్ పరిధిలోని మడుపల్లి, అల్లినగరం, బయ్యారం గ్రామాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని అధికారులు కోరారు.