ప్రోత్సాహకం పెంచాలి: జస్టిస్ ధీరజ్‌సింగ్
AP: విజయవంతమైన మధ్యవర్తిత్వానికి జాతీయ న్యాయసేవాధికార సంస్థ నుంచి రూ.3,000 మాత్రమే ఇస్తారని జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ తెలిపారు. ఏడాదిన్నరలో 1,800 మంది మధ్యవర్తులకు శిక్షణ ఇచ్చినా సరైన ప్రోత్సాహకం లేదన్నారు. వారిని ప్రోత్సహించాల్సిన అంశాన్ని సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు చెప్పారు. విజయవంతమైన మధ్యవర్తిత్వానికి రూ.10,000 ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.