భారత్‌కు బయలుదేరిన ఇంధన నౌకలు
దేశంలో వంటగ్యాస్ కొరత వేళ హార్ముజ్ జలసంధిని దాటుకొని మరో 2 నౌకలు భారత్‌కు వస్తున్నాయి. జగ్ వసంత్, పైన్ గ్యాస్ అనే LPG నౌకలు నిన్న హార్ముజ్ దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాబోయే 2 రోజుల్లో ఇవి భారత పోర్టులకు చేరుకోనున్నాయి. వీటిలో సుమారు 92వేల టన్నుల LPG ఉంది. కాగా ఇప్పటికే శివాలిక్, నందాదేవి, జగ్ లాడ్కీ షిప్పులు LPGని తీసుకొచ్చాయి.