రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

KDP: మైదుకూరు(M) వనిపెంట సమీపంలో సోమవారం రాత్రి ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు సిద్ధమ్మ (65) మృతి చెందింది. కొత్త సీతారామపురం గ్రామానికి చెందిన వీరారెడ్డి, సిద్ధమ్మ అనే దంపతులు మైదుకూరుకు వచ్చి తిరిగి గ్రామానికి వెళ్లేందుకు బి.మఠం వెళ్లే బస్సు ఎక్కారు. వారు వనిపెంటలో దిగి రోడ్డు దాటుతుండగా మైదుకూరు వైపు నుంచి వచ్చిన ట్రాక్టర్ సిద్ధమ్మను ఢీకొనడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.