చేవెళ్ల ప్రమాదంపై స్పందించిన కండక్టర్

చేవెళ్ల ప్రమాదంపై స్పందించిన కండక్టర్

TG: చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై బస్సు కండక్టర్ వివరణ ఇచ్చారు. 'ప్రమాద సమయంలో ఏం జరుగుతుందో నాకు తెలియలేదు. ప్రమాదాన్ని గ్రహించేలోపే కంకర లారీ బస్సును ఢీకొట్టింది. బస్సులో పోలీసులు, ఉద్యోగులు సహా మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు' అని తెలిపారు.