ఈ నెల 17న కొందుర్గ్‌లో హెల్త్ క్యాంప్
RR: ప్రజా పాలన ప్రగతి నివేదిక 99 రోజులలో భాగంగా ఈ నెల 17న కొందుర్గ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ క్యాంప్‌లో క్రింది విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య సేవలు, ఎముకల సంబంధిత సమస్యల పరీక్షలు, కంటి సమస్యల తనిఖీ, దంత సంబంధిత చికిత్సలకు పరీక్షలు చేయనున్నారు.