VIDEO: చీకట్లో మొక్కజొన్న రైతుల కష్టాలు
WGL: నల్లబెల్లి(M) కేంద్రంలోని ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో విద్యుత్ సౌకర్యం లేక రైతులు రాత్రివేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉపసర్పంచ్ వేణు ఆరోపించారు. వాతావరణ మార్పులతో ఎక్కడికక్కడ వర్షాలు కురుస్తుండగా, కరెంట్ లేక రైతులు సెల్ లైట్లతో ధాన్యంపై పరదాలు కప్పుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారులు స్పందించి ధాన్యం త్వరగా కొనుగోలు చేయలాని కోరారు.