అన్ని వేదికల్లోనూ టెస్టులు జరగాలి: గంగూలీ
BCCI ప్రకటించిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వేదికలపై SMలో విమర్శలు వస్తున్నాయి. వాంఖడేలో మ్యాచ్ లేకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, BCCI నిర్ణయంపై మాజీ కెప్టెన్ గంగూలీ మద్దతు తెలిపాడు. సంప్రదాయ వేదికలతో పాటు గౌహతి, రాంచీ వంటి నగరాల్లో టెస్టులు నిర్వహించడం క్రికెట్ విస్తరణకు దోహదపడతాయని చెప్పాడు. చెన్నై వంటి వేదికల ప్రాముఖ్యతను కూడా గంగూలీ గుర్తుచేశాడు.