VIDEO: తాగునీటి సరఫరాలో కోడి ఈకలు కలకలం
MDK: తూప్రాన్ పట్టణంలో మున్సిపాలిటీ సరఫరా చేసిన తాగునీటిలో కోడి ఈకలు కనిపించాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం 13వ వార్డులోని నల్లాల ద్వారా వచ్చిన నీటిలో ఈకలు, దుర్వాసన ఉండటంతో మహిళలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించి ట్యాంకులను శుభ్రం చేసి పరిశుభ్రమైన నీటిని అందించాలని ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.