పొదల్లో పసికందు మృతదేహం
VKB:వికారాబాద్ జిల్లా కేంద్రంలో దారణ ఘటన చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో ఉన్న పొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు నెలలు నిండిన పసికందు మృతదేహన్ని పడేసి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.