తెనాలిలో అర్జీలను స్వీకరించిన మంత్రి
GNTR: తెనాలి బోసురోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలు పింఛన్లు, రేషన్ కార్డులు వంటి వివిధ సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.