విద్యుత్ శాఖకు రూ.8 లక్షల నష్టం

మార్కాపురం నియోజకవర్గంలోని పలు మండలాలలో మంగళవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురు గాలులకు విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లినట్లు ట్రాన్స్‌కో ఏడీఈ నాయక్ తెలిపారు. మార్కాపురం తర్లపాడు, దోర్నాల, పెద్దారవీడు మండలాలలో దాదాపు 70 విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు తెలిపారు. దీంతో వైర్లు ఎక్కడికక్కడ తెగిపడ్డాయని, సుమారు రూ.8 లక్షలు ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు.