ఇది ఒక ముఖ్యమైన అడుగు: రామ్మోహన్ నాయుడు
AP: శ్రీకాకుళం జిల్లాను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మహిళా జూనియర్ కాలేజీలో ఇటీవల నూతనంగా నిర్మించిన గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అభివృద్ధిలో నూతన గదుల ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.