పలు గ్రామాల్లో పల్లె పల్లెకు జనవాణి కార్యక్రమం

VZM: గజపతినగరం మండలంలోని జిన్నాం, లింగాలవలస గ్రామాల్లో 'పల్లె పల్లెకు జనవాణి, కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాధరావు (జగన్) ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. పార్టీ నేతలు మామిడి దుర్గాప్రసాద్, మండల లక్ష్మనాయుడు తదితరులు పాల్గొన్నారు.