'జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'
NRPT: మక్తల్ నియోజకవర్గం పరిధిలోని ఉట్కూరు, మాగనూరు, కృష్ణ, మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా కాలంగా కోర్టులో పెండింగ్ ఉన్న కేసుల పరిష్కారం కోసం కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మక్తల్ సీఐ రామ్ లాల్ తెలిపారు. ఈ నెల 28వ తేదిన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో మక్తల్, నారాయణపేట కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ ఉంటుందన్నారు.