ఐతవరంలో నూతన DDO కార్యాలయం ప్రారంభం
NTR: నందిగామ నియోజకవర్గం ఐతవరంలో నూతన DDO (డివిజనల్ డెవలప్‌మెంట్ కార్యాలయం) కార్యాలయాన్ని కలెక్టర్ లక్ష్మీశతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. గ్రామీణ పరిపాలన మరింత బలోపేతం చేయడానికి ప్రజలకు సత్వర సేవలు అందించడానికి ఈ కార్యాలయాలను ఏర్పాటు చేశారని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.