పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌

పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌

MHBD: బయ్యారం మండలం నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వసతులు ,విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, వారి పఠన సామర్ధ్యాన్ని పరీక్షించారు. మెరుగైన విద్య బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.