బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.16కోట్లు మంజూరు

KMM: ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో తారురోడ్ల నిర్మాణానికి రూ.16.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి. DyCM మల్లు భట్టి విక్రమార్క చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలిపారు. మండలంలోని పెద్ద గోపవరం-బంజర, కొత్త గోపవరం-బంజర, జమలాపురం-రామాపురం మార్గంలో ఈ నిధులతో రహదారుల నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు.