రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్సీ దిగ్భ్రాంతి

రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్సీ దిగ్భ్రాంతి

NLR: కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై వైసీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.