ప్రసాద్ మృతికి బాబ్జి నివాళి

ప్రసాద్ మృతికి బాబ్జి నివాళి

W.G: అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నేత కామ్రేడ్ యస్.యస్ ప్రసాద్(68) శనివారం తాడేపల్లిగూడెంలో గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. ప్రసాద్‌కు భార్య ఇద్దరు కుమారులు వున్నారు. ఈ విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జి ప్రసాద్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.