బీసీ రాజారెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత
NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు పట్టణ మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డిని సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం నిర్వహించబోతున్న దత్త జయంతి కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు బీసీ రాజారెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం బీసీ రాజారెడ్డి ఆలయ అభివృద్ధిపై వారితో చర్చించారు.