ప్రజాదర్బార్‌లో బాధితుల సమస్యలు విన్న ఎమ్మెల్యే
PLD: వినుకొండ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన పాల్గొని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. జీవీ ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.