రాజాంలో కార్మికుల బైక్ ర్యాలీ

VZM: బీజేపీ అనుసరిస్తున్న ప్రజాకార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న అఖిల భారత సమ్మె జరుగుతుందని ఐక్యవేదిక నేత రామ్మూర్తి నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం రాజాంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేట్ లాభాల కోసమే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆ కోడ్లు రద్దుచేయాలని డిమాండ్ చేశారు.