సింగూర్ డ్యాంకు భారీ వరద

SRD: పుల్కల్ మండలం సింగూర్ డ్యాంలో భారీ వరద చేరుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 17,689 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతున్నట్లు DEE నాగరాజు తెలిపారు. ప్రాజెక్టు కెపాసిటీ 29.917 టీఎంసీలు కాగా, 22.022 టీఎంసీలు వద్దకు వరద జలాలు చేరాయని చెప్పారు. ఔట్ ఫ్లో 10,838 క్యూసెక్కులు కొనసాగుతున్నట్లు తెలిపారు.