VIDEO: ఇళ్లను చుట్టుముట్టిన వర్షపు నీరు
VZM: మొంథా తుఫాన్ కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జామి మండలం భీమసింగి గ్రామంలో పలుచోట్ల వర్షపు నీరు ఇళ్లను చుట్టుముట్టింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దైనందిక కార్యక్రమాలు చేసుకునేందుకు సైతం ఇబ్బందిగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.