273 మంది ప్రయాణికులు.. తృటిలో తప్పిన ప్రమాదం

గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న బోయింగ్-757 విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగాయి. 273 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే అప్రమత్తమై ఇటలీలోని బ్రిండిసి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పి, ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. మంటలు ఎలా చెలరేగాయనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.