భూమి ఆక్రమణపై తహశీల్దార్ విచారణ

AKP: నాతవరం మండలం గునుపూడిలో 1995లో ఎస్సీలకు అసైన్డ్ భూమికి పట్టాలు ఇచ్చారు. అయితే ఆ భూమిని బీసీ కులానికి చెందిన కొంత మంది ఆక్రమించి లాక్కొన్నారని బాధితులు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. కలెక్టర్ ఆదేశాలతో తహశీల్దార్ వేణుగోపాల్ శుక్రవారం ఇరువర్గాలను పిలిచి విచారించారు. భూమి స్వరూపం రీసర్వే చేయాలని సిబ్బందికి ఆదేశించారు.