'బాధితులకు సత్వర న్యాయం చేయాలి'

'బాధితులకు సత్వర న్యాయం చేయాలి'

PLD: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కేసుల్లో సత్వర న్యాయం చేయాలని గురజాల డీఎస్పీ మహేశ్వరరావును హక్కుల సమితి అధ్యక్షుడు అప్పారావు కోరారు. స్టేషన్‌లలో ఫిర్యాదులకు రసీదు ఇవ్వాలని, వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. యువతకు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవంలో పోలీసులు పాల్గొనాలని కోరుతూ.. వినతిపత్రం అందజేశారు.