కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు, హనుమాన్ దీక్షాపరులు భారీగా వచ్చారు. చిన్న జయంతి ఉత్సవాలు సమీపిస్తున్నందున దీక్షా స్వాములు అధిక సంఖ్యలో కొండకు చేరుకుని స్వామివారి సేవలో తరిస్తున్నారు. క్యూ లైన్లు, ఆలయ పరిసరాలు స్వాములతో, భక్తులతో సందడిగా మారాయి. జయంతి ఉత్సవాలకు ఈవో అంజనా రెడ్డి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేశారు.