చిలకల్లులో యువకుడు దారుణ హత్య

చిలకల్లులో యువకుడు దారుణ హత్య

NTR: జగ్గయ్యపేట(M) చిలకల్లులో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిల్ల సాయి అనే వ్యక్తి బర్త్ డేకు నవీన్ రెడ్డి అనే మరో వ్యక్తి హాజరయ్యాడు. ఈ క్రమంలో నవీన్, సాయికి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన సాయి, అతని స్నేహితులు నవీన్‌పై కత్తులతో దాడి చేసి స్థానిక ఆసుపత్రి ఎదుట వదిలేయగా, అతడు మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.