రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
BDK: మణుగూరు సీఎస్పీ కాటా వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విఠల్‌రావు నగర్‌కు చెందిన సిలివేరు రమేష్ (32) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.