దీపికతో ప్రేమకథను పంచుకున్న రణ్‌వీర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తన లవ్ స్టోరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ప్రేమకథ ఉదయపుర్‌లో ప్రారంభమైందని తెలిపాడు. ఈ ఊరు ప్రేమికులకు, ప్రేమకథలకు ఒక లక్ అని చెప్పాడు. తనకు లక్ష్మి వంటి భార్యను ఇచ్చిందని చెప్పాడు. 'రామ్ లీలా' సినిమా షూటింగ్ సమయంలో దీపిక పదుకొణెతో ప్రేమలో పడినట్లు రణ్‌వీర్ వెల్లడించాడు.