వినుకొండలో రోడ్డు ప్రమాదం.!
GNTR: వినుకొండలోని చీకటీగలపాలెం అడ్డరోడ్డు వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం లక్కరాజుగాజులపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రహదారి దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన బోలేరో వాహనం అతన్ని ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వ్యక్తిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.