న్యూట్రి, కిచెన్ గార్డెన్స్‌పై శిక్షణ కార్యక్రమం
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో న్యూట్రి, కిచెన్ గార్డెన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుర్రం జాషువా మీటింగ్ హాల్లో జరిగిన ఈ శిక్షణను కలెక్టర్ డా. కృతిక శుక్ల ప్రారంభించారు. ప్రకృతి సాగు ద్వారా రసాయన రహిత ఆహారం పొందవచ్చని తెలిపారు. ప్రతి కుటుంబం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీలలో కూడా గార్డెన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.