'చౌటుప్పల్‌లో రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలి'

'చౌటుప్పల్‌లో రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలి'

BHNG: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో రోడ్డు పనులు నత్త నడకన నడువడంతో స్థానిక వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నార‌ని ఎమ్మెల్సీ నెలికంటి సత్యం అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని రోడ్డు ప్లై ఓవర్ పనులను స్థానిక సిపిఐ నాయకులతో కలిసి బస్టాండ్ ముందు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పనులు త్వరగా అయ్యేవిధంగా చూడాలని కోరారు.