VIDEO: మల్లన్న జాతర సంప్రదాయం
SDPT: కొమురవెల్లి మల్లన్న జాతర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన అచ్చమైన జానపద జాతర. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం బోనాలతో జాతర ప్రారంభమై మూడు నెలలు కొనసాగుతుంది. జాతరకు ముందుగా నేడు మల్లన్న కల్యాణోత్సవం నిర్వహించారు. రావిచెట్టు, వరాల బండకు పూజలు చేశారు. సంతానం లేని మహిళలు వరాలబండను పూజిస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. కాగా, మల్లన్నను శివుని అవతారంగా కొలుస్తారు.