బాబు జగజ్జివన్ రామ్‌కు మంత్రి సవిత నివాళి

బాబు జగజ్జివన్ రామ్‌కు మంత్రి సవిత నివాళి

సత్యసాయి: భారత మాజీ ఉప ప్రధాని, ప్రముఖ సంఘ సంస్కర్త బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు పెనుకొండలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి సవిత ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, పరిపాలన దక్షతతో దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.