గుండెపోటుతో ఐసీడీఎస్ ఉద్యోగిని మృతి
KDP: బద్వేలు పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ లలితమ్మ (59) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల కార్యాలయ ఉద్యోగులు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.