నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KDP: మైదుకూరు విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రామభద్రయ్య తెలిపారు. మైదుకూరుతోపాటు తెలుగుగంగకాలనీ విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలో సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.