VIDEO: విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం

VIDEO: విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం

SRD: సంగారెడ్డి పట్టణంలోని బీసీ వసతి గృహాన్ని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యత చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన భోజనాన్ని అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.