VIDEO: ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా
AKP: నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద ఇవాళ సీపీఐ ఎంఎల్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనార్ధన్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆదివాసి భూములను కబ్జాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. జరుగుతున్న అన్యాయం మీద పోరాడుతున్న నాయకులను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆదివాసి భూములకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.