అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
NLR: కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెం పంచాయతీలో పలు అభివృద్ధి పనులను MLA కాకర్ల సురేశ్ ప్రారంభించారు. రైతు సేవ కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, సీసీ రోడ్లను, బట్టువారిపాలెం వెళ్లే బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మండలంలో ఇప్పటికే అనేక చోట్ల ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించామని తెలిపారు.