లైట్‌హౌస్ ఫెస్టివల్ ప్రారంభం
విశాఖలోని ఎంజీఎం పార్క్‌లో లైట్ హౌస్ ఫెస్టివల్ స్టాల్స్‌ను కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 44 స్టాల్స్‌లో హస్తకళలు, సంప్రదాయ వస్త్రాలు, చెక్కబొమ్మలు, చిత్రకళ, ఆహార పదార్థాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వందలాది మంది సందర్శకులు స్టాళ్లను సందర్శించారు.