ఎంసీసీ సిమెంట్ కంపెనీలో చోరీ: ఎస్సై

MNCL: మంచిర్యాల ఎంసీసీ సిమెంట్ కంపెనీలో చోరీ జరిగింది. ఎస్సై ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం.. మూతపడిన ఎంసీసీ కంపెనీలోకి సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు ప్రహరీ దూకి రూ.1.50 లక్షలు విలువ చేసే రాగి తీగ, వైట్ మెటల్ ఎత్తుకెళ్లారు. సెక్యూరిటీ గార్డు ఎలుకపల్లి రాజ్ కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.