ప్రజావాణిలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయంటే..?
KNR: సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 229 మంది అర్జీదారులు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటిని అధికారులకు బదిలీ చేశారు. త్వరితగతిన దరఖాస్తులు పరిష్కరించాలని, పెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయాలని అన్నారు.