నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
PPM: పాచిపెంట సబ్ స్టేషన్ పరిధిలో మెయింటినెన్స్ పనుల నిమిత్తం శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE కె. గోపాలరావు నాయుడు గురువారం తెలిపారు. ఈ మేరకు పాచిపెంట, కర్రివలస, మాతుమూరు, వాటర్ వర్క్స్, ఇండస్టియల్ ఫీడర్ పరిధిలో గ్రామాలకు సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.