రూ.5లక్షల కోట్ల భూదోపిడీ జరుగుతోంది: KTR
TG: రాష్ట్రంలోని భూములను ప్రభుత్వం.. చౌక ధరకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోందని మాజీమంత్రి KTR ఆరోపించారు. 'భూముల దోపిడీ ఆర్నెళ్లుగా జరుగుతోంది. కానీ పాలసీ ఇప్పుడు బయటకొచ్చింది. ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలి. రూ.5లక్షల కోట్ల భూదోపిడీకి పాల్పడుతున్నారు. ఈ భూకుంభకోణంపై క్షేత్రస్థాయిలో పోరాడతాం. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలి' అని అన్నారు.