కమ్మ వెల్ఫేర్&డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా వాణిశ్రీ

ELR: జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు, నగర ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీని ఏపీ కమ్మ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు సోమవారం రాత్రి అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంపై ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.