సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ డ్రైవర్ల నిరసన
NGKL: జిల్లాలోని ఆర్టీసీలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద SWF సంఘం ఆధ్వర్యంలో డ్రైవర్లు నిరసన తెలిపారు. ఆర్టీసీ సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, పదవీ విరమణ పొందిన డ్రైవర్లు, కండక్టర్లకు సంబంధించిన పెండింగ్ అంశాలను పరిష్కరించాలని వారు కోరారు.